
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని సర్వమతతీత శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రుత్వికరణము, అఖండ దీపారాధన, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పూజ, సాయిబాబా వారికి పంచామృత స్నానం, పంచసూక్తి అభిషేకం జరుగునని తెలిపారు. మధ్యాహ్నం హారతి అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి అతి వైభవంగా శ్రీ షిరిడి సాయిబాబా రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ చైర్మన్ వెంపటి సదానందం, ఆలయ కమిటీ మరియు అర్చకులు తెలిపారు.








