
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జడ్.పి.హెచ్.ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఏంఈఓ కే శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాలికల ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి చందా రూపకంగా మొత్తాన్ని జమ చేసి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకొని కృషి పట్టుదలతో చదివి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్ తిరుమల, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఆసియా, శ్రీలత, అర్చన, ఈశ్వర్ రెడ్డి, మాధవిలత, విజయ, మారుతి ప్రసాద్, సంపత్ కుమార్, పిడి సొల్లు సారయ్య, శ్రావణి, శ్రీనివాస్, స్వాతిరావు, రాములు, జమునరాణి, శోభ రాణి, కే సదానందం తదితరులు పాల్గొన్నారు.








