
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:
మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులకు జడ్జి జైలు శిక్ష మరియు జరిమానా విధించినట్లు కరీంనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ గురువారం తెలిపారు. కరీంనగర్ పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన (26) మంది వ్యక్తులను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు కరీంనగర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్(జడ్జి) అందులో నుండి ఇద్దరు వ్యక్తులకు ఐదు రోజుల జైలు శిక్ష, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష మరియు మొత్తం రూ, 6,500 జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే మిగతా ఇరవై మూడు మంది వ్యక్తులకు రూ. 35,500 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరములో రెండు వందల నాలుగు (204) మంది వ్యక్తులకు జైలు శిక్ష పడిందని, కానుక మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, అదేవిధంగా జైలు శిక్షకు గురి కావద్దని మరియు జైలు శిక్ష పడిన వ్యక్తుల లైసెన్స్ లు కూడా సస్పెండ్ చేయడానికి RTO కార్యాలయానికి సిపారసు చేయడం జరుగుతుందని కరీంనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ తెలిపారు.






