
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో గవర్నర్‌కే గౌరవం దక్కలేదు. ఎవ్వరా రాజకీయ ప్రతినిధి అనుకుంటున్నారా!? ఆయనే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే,.. పాడి కౌశిక్ రెడ్డి. అందరూ ఈ పేరు వినే ఉంటారు, ఆయనకు మహిళలంటే గౌరవం ఉందా లేదా! అందులో చట్టసభలకు గౌరవంగా పంపించిన ప్రజాప్రతినిధులు, మహిళలు ఎవరైతేనే ఆయనకు మాత్రం మహిళలను గౌరవించడం తెలియదని అర్థమవుతుంది. ఈరోజు జరిగిన అసెంబ్లీ అందరి సాక్షిగా జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. ఆ మాటలు ఓ మహిళ ప్రజా ప్రతినిధిని, మంత్రి గారినే ఏకంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం అధికార పక్షం నుండి వచ్చిన ఒత్తిడి మేరకు తిరిగి ఆ పదాలను మాత్రమే వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు తప్ప.. క్షమాపణ కోరిన దాఖలాలు లేవు. అంటే ఆయన లోపల ఎంత దురహంకారం ఉందనేది రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ కార్యకర్తలకు అర్థం కాలేక పోలేదు. ఇప్పటికైనా మహిళ మంత్రి అని చూడకుండా వ్యాఖ్యలు చేయడాన్ని వెనక్కి తీసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ పలు మహిళా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోఆందోళనకు దిగనున్నట్లు స్పష్టం చేస్తున్నారు.







