
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: పెన్షనర్స్ సమస్యల సాధనకై మంగళ వారం రోజున హైదరాబాద్ లోని ఇందిరపార్క్ వద్ద తెలంగాణ పెన్షనర్స్ JAC సమక్షములో జరిగిన మౌన దీక్ష శిభిరంలో కరీంనగర్ జిల్లా నుండి జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా JAC ప్రతినిధులు తెలంగాణ అల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పెర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు గౌరవధ్యక్షులు చందుపట్ల జనార్దన్, కట్టా నాగభూషణం చారి మరియు ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న DAలను వెంటనే మంజూరు చేస్తూ IR ను 5శాతం నుండి 20శాతంకు తక్షణమే పెంచాలని మరియు నూతన PRCని వెంటనే ప్రకటించి జులై 2023 నుండి అమలు చేయాలనీ ప్రభుత్వంను డిమాండ్ చేశారు. అదే విధంగా పెన్షనర్స్ ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రతి జిల్లాలో 02 వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, ఎనమనగండ్ల రామస్వామి, గరిగే చంద్రయ్య, ఎండీ హసన్, భోగం రాజయ్య, ఆర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.








