
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ టౌన్ సిఐ బొల్లం రమేష్ కరీంనగర్ సిసిఎస్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ సిఎస్ బి త్రీ గా పనిచేస్తున్న జి తిరుమల్ ను హుజురాబాద్ టౌన్ సిఐగా నియమించారు. 13 మంది సీఐలను( ఇన్స్పెక్టర్లను) బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిసిఎస్ లో పనిచేస్తున్న కే. ప్రవీణ్ కుమార్ ను పెద్దపల్లి సిఐగా, పెద్దపల్లి సిఐగా పనిచేస్తున్న కృష్ణను ఐజి కార్యాలయానికి బదిలీ చేశారు. కరీంనగర్ సిఎస్బి 3 లోపని చేస్తున్న జి తిరుమల్ ను హుజురాబాద్ కు, హుజురాబాద్లో పనిచేస్తున్న బొల్లం రమేష్ ను కరీంనగర్ సిసిఎస్ కు, వాంకిడిలో పనిచేస్తున్న శ్రీనివాసులు కరీంనగర్ సిఎస్బి 3 కి బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న రామకృష్ణను నిర్మల్ రూరల్ కు, ఐజీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న సునీల్ కుమార్ ను ఆదిలాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సిఐ బొల్లం రమేష్ గత 19 నెలల పాటు హుజురాబాద్ టౌన్ సిఐగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలందించారు. సీఐ బదిలీ అయిన విషయం తెలియగానే హుజురాబాద్ పట్టణంతోపాటు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా బదిలీ అయింది నిజమేనా..!? అంటూ మీడియా వారిని ఆరా తీయడం ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో రెండు సార్లు సిఐ రమేష్ బదిలీ అయి మళ్లీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పలువురికి అనుమానాలు రేకెత్తించాయి.







