
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు ఇంకా సుమారు 3,500 మందికి పైగా రావాల్సి ఉందని వెంటనే రెండో విడత దళిత బంధు విడుదల చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా దళిత బందు పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ను ఎంపిక చేసి సుమారు 18 వేల కుటుంబాలకు పైగా దళిత బంధు అందించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన దళిత కుటుంబాలు అందరికీ 10 లక్షలు వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకర్లతో రెండో విడత ఇవ్వకుండా అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో కనీసం దళితుల ఊసు ఎందుకు ఎత్తలేదు చెప్పాలి. కనీసం హుజురాబాద్ నియోజకవర్గం లో రెండో విడత దళిత బంధు డబ్బులు వారి అకౌంట్లో ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు. హుజురాబాద్ నడిబొడ్డున చిరు వ్యాపారులైన పండ్ల పండ్ల వ్యాపారుల 31 దుకాణాలు అర్ధరాత్రి దద్ధమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. చిరు వ్యాపారుల గోస చూడలేక ఎమ్మెల్యే జీతం నుంచి ఒక్కో షాపుకు తాత్కాలిక ఉపశమనం కింద పదివేల రూపాయలతో పాటు తాత్కాలిక షెడ్ల నిర్మాణానికి ఒక లక్ష ఇచ్చానని మొత్తం నాలుగు లక్షల పదివేల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిరు వ్యాపారుల షెడ్లను పర్మినెంట్ చేస్తూ వారికి వెంటనే ఒక్కో షాపుకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ జర్నలిస్టుల 40 ఏళ్ల కలను నెరవేర్చాలని ఉద్దేశంతో వారికి కెసి క్యాంపులో కేటాయించిన 80 ప్లాట్లను ఎందుకు ఆపివేయాలని చూస్తున్నారో చెప్పాలని అన్నారు. మంత్రి సన్నిహితుడు తోటే జర్నలిస్టుల ఫ్లాట్లపై కేసు వేయించారని మంత్రి చొరవ తీసుకొని కేసును ఉపసంహరించుకునేల చేసి జర్నలిస్టులకు అండగా నిలవాలి అన్నారు. జర్నలిస్టుల విషయంలో ఏదైనా అన్యాయం జరుగుతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. జర్నలిస్టుల కోసం కేటాయించిన స్థలాన్ని ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నారు. సీఎం అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చేలోగా కుర్చీ అతనికి ఉంటుందో లేదో అని డౌట్ వస్తుందన్నారు. కాంగ్రెస్ మంత్రుల చిట్ చాట్ చూస్తూ ఉంటే అదే నిజమనిపిస్తుందని ఆయన అన్నారు.






