
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలో ఒకేరోజు ఇద్దరు మండల స్థాయి అధికారులు బాధ్యతలు చేపట్టారు. అందులో ఒకరు తాసిల్దార్ కాగా మరొకరు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఉన్నారు.
-వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా ఆర్ మల్లేశం…
హుజుర్ నగర్ వ్యవసాయ మార్కెట్ నుండి బదిలీ పై జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కి ఉన్నత శ్రేణి కార్యదర్శి గా వచ్చిన ఆర్ మల్లేశం శుక్రవారం పదవి భాద్యతలు స్వీకరించారు. జమ్మికుంట ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పనిచేసినటువంటి గుగులోతు రెడ్డి నర్సంపేట్ మార్కెట్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా మార్కెట్ సిబ్బంది, మరియు పత్తి వ్యాపారస్థులు శాలువాలతో పుష్ప గుచ్చంలతో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
-జమ్మికుంట తహసిల్దార్ గా గట్ల రమేష్ బాబు.
సాధారణ బదిలీలో భాగంగా గంగాధరలో విధులు నిర్వహిస్తున్న గట్ల రమేష్ బాబు జమ్మికుంటకు వచ్చారు. శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలు, రైతులు ఏమైనా సమస్యలు ఉంటే తమను నేరుగా సంప్రదించాలని కోరారు. తమ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.








