
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి సంబంధించిన రెండు చెరువుల అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గ్రామ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని చిన్న- పెద్ద చెరువుల మధ్య ఉన్నటువంటి లింక్ కెనాల్ నిర్మాణం మరియు రెండు చెరువులను కూడా పూర్తిస్థాయిలో మరమత్తు చేయాలని, పెద్ద చెరువు పైకి వెళ్లడానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలనీ హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డికి ఈరోజు హుజురాబాద్ లో వినతి పత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారని మహేందర్ తెలిపారు.
