
Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదలకు ఉచిత ఆపరేషన్ చేయడం అభినందనీయమని ఆల్ మైటీ పాస్టర్స్ హుజురాబాద్ నియోజకవర్గం పాస్టర్స్ అధ్యక్షుడు పాస్టర్ నాగిశెట్టి దానియేల్ అన్నారు. శనివారం హుజురాబాద్ లోని సూపర్ బజార్ లో గల సుజాత హాస్పిటల్ లో ఆల్ మైటీ పాస్టర్స్ హుజురాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తిలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలకు ఉచిత వైద్యం అందించడంతో చాలామంది నిరుపేదలకు సహాయం అవుతుందని అన్నారు. పేదలంతా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల కోసం వైద్యురాలు సుజాత అందిస్తున్న తీరు హర్షినీయమన్నారు. వైద్యురాలు సుజాతను మరి కొంతమంది వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వాహకుడు గుజ్జుల మధుకర్ రెడ్డి, పాస్టర్లు వరికిల్ల ప్రసాద్, హుజురాబాద్ పాస్టర్స్ మండల ప్రెసిడెంట్ పాస్టర్ డి డేవిడ్ రాజు, ఉపాధ్యక్షులు పాస్టర్ చల్లూరి ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పాస్టర్ సారంగపాణి, కోశాధికారి పాస్టర్ కె జోసెఫ, కెఎల్ డానియల్, పి ఆంధ్రయ, ఎం అజయ్ పాస్టర్, ఆసుపత్రి సిబ్బంది దివ్య, కిరణ్, సంతోష్, సుజాత, తిరుపతి, కృష్ణమూర్తి, సదానందం పాల్గొన్నారు.

———————++++++++——————–
@పత్రికా ప్రకటనలు(యాడ్స్)@
—————+++++++++———————
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#
