
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు పాల్గొని కళాశాల విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.. ప్రతీ ఒక్కరు మొక్కల పెంపకంను ప్రోత్సహించాలనీ, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి వాటి స్థానంలో జుట్ సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే సుగుణ, అధ్యాపకులు తులసీదాసు, మల్లారెడ్డి, విజయేందర్ రెడ్డి, మురళీ, సుహాసిని, శైలజ, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






