
-బోజనానికి ముందు తప్పక చేతులు కడ్డుకోవాలి.
-పిల్లలకు ఈకో క్లబ్ మరియు మాస్టర్ టైనర్లతో అవగాహన కల్పించాలి.
-ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తడి పొడి చెత్తను వేరు వేరుగా చెత్తబుట్టలలో వేసేలా పిల్లలు వారి తల్లి తండ్రులను ఒప్పించాలనీ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు తరగతి గదిలో పుస్తకాలలోని పాటలతో పాటు, స్వచ్చదనం పచ్చదనం, కుక్కలు మరియు కోతులతో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి వంటి విషయాలపై ఈకో క్లబ్ మరియు మాస్టర్ టైనర్లతో అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లందరూ బోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అలాగే రోడ్లపై కనబడే పానీపూరి తదితర చిరుతిళ్లను దూరంగా ఉండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పాదరక్షలు లేకుండా ఆరుబయట సంచరించ కూడదని, వేడిచేసి చల్లార్చిన శుద్ధమైన నీటిని మాత్రమే తాగాలని. ప్రతి శుక్ర, మంగళవారాల్లో చేపట్టే ఫ్రై డే – డ్రై డే కార్యక్రమంలో పాల్గొని నిల్వ ఉండే నీటిని తొలగించాలన్నారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు సంభవించకుండా పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలకు నట్టల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్లాసులు, మాంసం, కూరగాయలు తదితరాలకు కొరకు ఒకసారి వాడి పడిపడేసే ప్లాస్టిక్ దూరంగా ఉండాలని, ఐ క్యారీ – ఐ కేర్ నినాదంతో ప్లాస్టిక్ కు ప్రత్యానామంగా జూట్ లేదా చేతి సంచులు, స్టిల్ లేదా కాపర్ మంచినీటి బాటిళ్లు, మాంసం కొరకు డబ్బాలను వినియోగించాలని తెలిపారు. విధి కుక్కలతో ఐ-కాంటాక్ట్ చేయకుండా, సాధ్యమైనంతగా దూరంగా ఉండేలా చూసుకోవాల, ఆ దిశగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కుక్కలు, కోతులతో ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం పిల్లలకు పెన్నులను అందించి, పలు పారిశుధ్య కార్మికులను శాలువాతో సత్కరించారు. చివరగా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, ఆర్ డిఓ రమేష్ బాబు, తహసీల్దార్ కనకయ్య, మున్సిపల్ కమిషన ఎస్ సమ్మయ్య, వెటర్నరీ డాక్టర్ రవికుమార్, కౌన్సిలర్ రమ, సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్, పాఠశాల ప్రదానోపాద్యాయలు, సిబ్బంది పాల్గోన్నారు.








