
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: సుంకిశాల ప్రమాదానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ దే అని, రేవంత్ రెడ్డి అసమర్థత, చేతగానితనం, చేవ లేని తనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.
ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారం రోజులపాటు దాచి ఉంచిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆగస్ట్ 2న ఈ ప్రమాదం జరిగిందనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం సమావేశాల్లో స్టేట్ మెంట్ చేయాలి కానీ, ఈ ప్రమాదం జరిగినప్పుడు అసెంబ్లీ జరుగుతోన్న కానీ చెప్పలేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? తెలిసి పట్టించుకోలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక వేళ మీకు ఈ విషయమే తెలియదంటే మాత్రం ఇది సిగ్గుచేటు అన్నారు. ఈ ప్రమాదం గురించి పక్కా మీకు తెలుసునని, వారం రోజులు గోప్యంగా ఉంచారన్నారు.
మీరు ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారనీ,అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగిందనీ లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేదన్నారు, మంచి జరిగితే మాది, చెడు జరిగితే బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దు అని సూచించారు. పురపాలక శాఖను పర్యవేక్షించకుండా ఉన్నా ముఖ్యమంత్రిదే దీనికి బాధ్యత అని మళ్లీ మాపైనే చిల్లర దాడి, చిల్లర ప్రయత్నం మానుకోవాలని కేటీఆర్ సూచించారు.
వీళ్లు మంచి జరిగితే మాదనీ లేదంటే ఇతరుల తప్పు అని ప్రకటిస్తారనీ, బాధ్యతల నుంచి తప్పించుకొని గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాలేశ్వరం పైన చేసిన అడ్డగోలు వాదనలు తేలిపోయిందన్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉన్నదనీ, కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వాయర్లను పంపింగ్ చేసి నీల్లు నింపుతుందన్నారు. నీళ్ల విషయంలో కెసిఆర్ విజయాలను అంగీకరించలేని కురచమనస్తత్వంతోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. కాళేశ్వరంలో జరిగితే ఎన్డీఎస్ఏ వస్తది, ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇస్తార అన్నారు. మరి ఇక్కడకు ఎందుకు కేంద్ర సంస్థ వస్తలే ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అని అనుకోవాలెనా అన్నారు.
ఈ అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయండనీ, సంఘటన స్థలంలోనే భట్టి ఈ ప్రకటన చేయాలె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యం, పరిపాలన మీద పట్టులేని విషయం తెలిసిపోతోందన్నారు. ఈ విషయంలో తప్పించుకుంటామంటే ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అన్నారు. సుంకేశాల ప్రాజెక్టు ఇంజనీరింగ్ లోపం లేదనీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలో లోపం ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు విధానం తప్ప… ఇప్పటిదాకా తీసుకొచ్చిన విధానాలు ఏంటిదో చెప్పాలన్నారు.
మేడిగడ్డలో జరిగిన సంఘటనను మేము దాయలేదని, ఎన్నికల కోడ్ ఉన్న సరే ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పామన్నారు. ఘటన జరిగిన గంటల్లోనే మేము లోపాలు సర్దుతామని ఎల్ అండ్ టీ చెప్పిందనీ మాకు సీక్రెసీ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేకుండే అన్నారు. కానీ ముఖ్యమంత్రి ఎందుకు ఈ విషయాన్ని దాచారనీ, ఈ ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్ లోనే సీఎం ఉన్నారన్నారు. ఆ మరునాడే దాని మీద పర్యవేక్షణ లేకుండా అమెరికా వెళ్లారనీ కేటీఆర్ ఆరోపించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
భట్టి విక్రమార్క ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేయవద్దనీ, ఒకవేళ ముఖ్యమంత్రి ఈ విషయం తెలియకపోతే ఆయన పరిపాలన పట్టు లేనట్లే అన్నారు. సుంకిశాల ప్రమాదానికి కారణమై రాష్ట్ర సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసిందనీ కెసిఅర్ హయాంలో దీనికోసం ప్రతిపాదన చేశారన్నారు. అప్పట్లో మాకు అన్యాయం చేయవద్దంటూ రైతులు అడ్డుకోవటంతో అక్కడ ఒక సబ్ ఇన్ స్పెక్టర్ కూడా చనిపోయారనీ కేటీఆర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రెండు, మూడు దశలు అంటూ ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చారనీ కానీ రైతులు మళ్లీ అడ్డుకోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏక బిగిన సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టారు. రైతుల్లో విశ్వాసం నింపటంతో సుంకిశాలను రైతులు అడ్డుకోలేదన్నారు. ఎలిమినేటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలంటే సాగర్లో 510 అడుగుల నీళ్లు ఉంటేనే నీళ్లు తీసుకోవటం సాధ్యమవుతుందన్నారు. సుంకిశాలలో మాత్రం 462 అడుగులు ఉన్నా సరే నీళ్లు తీసుకోవచ్చు అన్నారు. రాబోయే 50 ఏళ్లలో హైదరాబాద్ నీటి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ చేపట్టారనీ గుర్తు చేశారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజా ప్రతినిధులంతా కలిసి మేము అప్పుడు దీన్ని శంకుస్థాపన చేశామని, శరవేగంగా ప్రాజెక్ట్ కు ముందుకు తీసుకెళ్లామన్నారు. మూడు పైప్ లైన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనీ కేటీఆర్ తెలిపారు. కృష్ణానదికి మూడు, నాలుగేళ్లు వరద రాకపోయిన డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిశాల ద్వారా నీళ్లు తేవచ్చు అన్నారు. ఓఆర్ఆర్ చుట్టు ఒక రింగ్ మెయిన్ చేయాలనే ఉద్దేశంతో గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏమీ తెలియవు అన్నారు.
ఢిల్లీ, బెంగళూరు లాంటి చాలా నగరాల్లో భారీగా కొరత ఉందనీ, దేశ రాజధాని ఢిల్లీలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదనీ హైదరాబాద్ కు తాగు నీటి కరువు ఉండకుండా చేసేందుకే ఈ ప్రాజెక్ట్ చేపట్టాం అని, సీతారామా ప్రాజెక్ట్ గురించి భట్టి బిల్డప్ ఇచ్చారనీ కానీ ఆ ప్రాజెక్ట్ ను చేపట్టింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్రే అన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన పథకాన్ని మీరు పూర్తి చేసినట్టు చెప్పుకున్న ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అన్నారు. సుంకిశాలను చాలా వేగంగా పనులు పూర్తి చేశాం, ఒక్క మోటార్ ఫిట్టింగ్ పనులు మాత్రమే ఉండే అన్నారు. 2024 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం పనులను పెండింగ్ పెట్టారన్నారు. పురపాలక శాఖలో మొత్తం పనులను పడకేశాయి.….సుంకిశాల పనులను పక్కన పెట్టారు అని కేటీఆర్ ఆరోపించారు. మొన్నటి ఎండకాలంలో హైదరాబాద్ ట్యాంకర్లు రావటంతో ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు రావటంతో రెండు, మూడు నెలల కిత్రం దున్నపోతు నిద్ర వీడారన్నారు. ఆ తర్వాత అధికారులను ఒత్తిడి పెట్టి ఆగమాగం పనులు చేపట్టారనీ కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని జలమండలి అధికారితో వివరంగా మాట్లాడాను అని కేటీఆర్ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కూడా స్పీడ్ గానే చేశామన్నారు. సాగునీరు, తాగునీరు రెండింటికి ప్రాధాన్యం ఇచ్చాం కనుకే రైతులు ఆందోళన చేయలేదన్నారు.
సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. అందుకే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పరిపాలన రాక ప్రతి దానికి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనీ వాళ్ల బాకా ఊదే పత్రికలే లా అండ్ ఆర్డర్ మీద కథనాలు రాస్తున్నాయనీ పేర్లు మార్చటమేనా మార్పు అంటే…భట్టి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
మేము కూడా సుంకిశాలకు వెళ్లి మొత్తం వివరాలను అక్కడ నుంచి వివరిస్తామన్నారు. మేడిగడ్డ మీద విచారణ చేస్తున్నారనీ, 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్న సరే మేడిగడ్డకు ఏమీ కాలేదనీ ఇన్నాళ్లు కాళేశ్వరమంతా చిల్లర, దివాళాకోరు ప్రచారాలు చేసిన ప్రకృతే వీళ్ల తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పిందన్నారు. వీళ్లకు సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. వీళ్లకు బ్యారేజ్ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయటానికి ఎలాంటి ఇబ్బంది లేదనీ, ఇంత మంచి ప్రాజెక్ట్ ను తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంజనీర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ఫెయిల్ అయితే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయనీ ఇది మూర్ఖ, కుచ్చిత మనస్తత్వం ఉన్న ప్రభుత్వం అన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ కు పేరు వస్తదనే ఇలా చేస్తున్నారనీ, రేవంత్ రెడ్డి చేతగానీ తనం కారణంగానే వారం రోజుల పాటు ఈ అంశాన్ని దాచిపెట్టారనీ కేటీఆర్ ఆరోపించారు. ఒక వేళ ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోతే ముఖ్యమంత్రిగా పరిపాలన మీద ఆయనకు ఎంత పట్టు ఉన్నట్లు? కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయన వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.






