Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల డిజైన్లు అంతా లోప బుయిష్టంగా చేపట్టారని, వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. శుక్రవారం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్లగొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకానికి సంబంధించిన వాల్ కూలడం బీఆర్ఎస్ హయంలో చేపట్టిన నాసిరకం పనులే కారణమని మండిపడ్డారు. వారి హాయంలో కట్టిందే కూలిందని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు బధ్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సుంకిశాల వాల్ కూలిపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కాంగ్రెస్ సర్కార్ పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో ఎవరేం చేశారో ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా డిజైన్లు, నాసిరకం పనుల వల్ల చేపట్టిన ప్రాజెక్టులు పనికి రాకుండా తయారయ్యాయని ఆరోపించారు. వేలాది కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రాజెక్టులు, పథకాలు 10 కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించలేదని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఇన్నాళ్లు కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అనుకున్నామని, గత బీఆర్ఎస్ పాలకులు కట్టినవన్నీ అద్వానమేనని ప్రస్తుతం తెలుస్తున్నదని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టును పనికిరాకుండా చేశారని, నాసిరకం పనుల వల్లే రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని తెలిపారు.
తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని వెలిచాల రాజేందర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. సీఎం విదేశీ పర్యటనలో భాగంగా వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే దీటైన నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.






