
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఆ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కూతాడి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసి గిరిజనులు వారి హక్కుల కోసం పోరాడి అమరులైన జ్ఞాపకాలను గుర్తించుకునే విధంగా ఐక్యరాజ్యసమితి 1982లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి గిరిజనలకు ఆగస్టు 9 రోజును ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా జరుపుకోవాలని యునెస్కో వారు నిర్ణయించడం జరిగిందన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తెగలు ఆగస్టు 9న ఒక పర్వదినంగా, ఆదివాసుల పండుగగా జరుపుకుంటూ వస్తున్నారని కుమారస్వామి గుర్తు చేశారు.
దేశంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి సబ్బండా వర్గాల తెగలను అనగాదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఆదివాసి గిరిజనులు ఉన్నప్పటికీ అందులో ఆదివాసి ఎరుకల తెగ విద్యా ఉద్యోగాలలో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. భారతదేశంలో మా వారసుడు ఏకలవ్యుడు తన సర్వస్వం కోల్పోయినట్లుగా తెలంగాణలో కూడా ఏకలవ్యుడు వారసులైన ఆదివాసి ఎరుకల ప్రజలు తెలంగాణలో సర్వం కోల్పోతున్నారని గుర్తు చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు మా ధరికి చేరడం లేదని ఆవేదన వ్యక్తము చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి ఎరుకల కుటుంబాలను, యువకులను, విద్యార్థులను గుర్తించి విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆనంతరం ఆదివాసి హక్కుల కోసం పోరాడి అమరులైన అమరవీరులకు నివాళులర్పించి రాజ్యాంగపరంగా రావలసిన హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం మరియు తెలంగాణ ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘాలను గుర్తించాలని తెలంగాణ ఎరుకల జాతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో
జిల్లా కోశాధికారి మానుపాటి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి కుతాడి కుమార్, యూత్ నాయకులు
లొకిని పూర్ణచేందర్, యూత్ మండల అధ్యక్షులు
దుగ్యాల జగదీశ్వర్, మండల యూత్ నాయకులు
కుర్ర అంజి తదితరులు పాల్గొన్నారు.







