
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే వారికి రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్టు హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల సేవలో ఆర్టీసీ నిత్యం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే వివాహాది శుభ కార్యాలకు బస్సులను వినియోగించుకునే వారికి 10 శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు డిపో కార్యాలయంలో కానీ లేదా సెల్: 9959225924, 9704833971, 7382848248, 9247159535 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
