
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని ఇప్పనర్సింగాపూర్ లో ఇటీవల మరణించిన బిజెపి నాయకుడు పల్లె శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి పరామర్శించి, శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే బిజెపి నాయకుడు గొట్ట రవీందర్ మాతృమూర్తి ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి, చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.






