Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో బిల్డర్స్ అండ్ ఇంజనీర్ గెట్ టు గెదర్ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రధాన వక్తగా విచ్చేసిన విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ, దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతా మన భారతదేశం వైపుచూస్తుందని, అనేక సమస్యలకు పరిష్కారంగా పూర్వికులు ముందు చూపుతో పరంపరాగతమైన ఆలోచనలు మనకు జీవనాధారంగా ఉన్నాయని, మునుముందు మనమంతా జాగరుకులై మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి మన వంతు పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాభై మంది బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ పాల్గొన్నారు. పోలు సత్యనారాయణ (Retd teacher ) పాఠశాల అభివృద్ధి కొరకు 1 లక్ష 116/- రూపాయలు విరాళంగా అందజేశారు. పాఠశాల సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ ప్రస్థావన చేయగా, పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు అభివృద్ధి నివేదికను సమర్పించారు. జ్యేష్ఠ కార్యకర్త పాక రాజమౌళి, పాఠశాల కార్యదర్శి ఇంజనీర్స్ కోల అన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.






