Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్( ఏఐబిఎస్ఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ గా నియమితులైన భూక్య భాస్కర్ నాయక్ కి పలువురు శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు సభవత్ రాజు నాయక్ & రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవీందర్ నాయక్ & రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఇందల్ రాథోడ్ కి భాస్కర్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూక్య భాస్కర్ నాయక్ మాట్లాడుతూ నా పైన నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు సభావాత్ రాజునాయక్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ బాధ్యత నాకు మరింత సేవ చేసే అవకాశం కల్పించిన సభవత్ రాజు నాయక్ కి రుణపడి ఉంటాను అన్నారు. బంజారాలకు ఏ సమస్య వచ్చినా కచ్చితంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సభవత్ రాజు నాయక్ మాట్లాడుతూ. భూక్యా భాస్కర్ నాయక్ గత కొద్ది సంవత్సరాలుగా సిరిసిల్ల ప్రాంతంలో బంజారాలకు ఏ సమస్య వచ్చినా సమస్యను పరిష్కారం చూపేవారని, వారిపై నమ్మకంతో ఈ పదవి ఇవ్వడం జరిగిందన్నారు.






