
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వర్షాకాలం సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచదనం- పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. స్వచదనం కార్యక్రమంలో పాల్గొనే అధికారులు గ్రామాలలో పట్టణాల్లో పారిశుద్ధ్యము మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అన్నారు. పట్టణాలు,గ్రామాల్లో పారిశుద్ధంపై, త్రాగునీరుపై, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హుజురాబాద్ నియోజవర్గ అధికారులను కోరారు. డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఆ భాధ్యత హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ లు, ఆయా మండలాల ఎంపిడిఓలు తీసుకోవాలనీ కోరారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.






