Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాఖీ పౌర్ణమితో పాటు వరుస సెలవులు రావడం ఆర్టీసీకి వరంగా మారింది. రాఖీ పౌర్ణమి పండుగ రోజున హుజురాబాద్ డిపో బస్సులు 28380 కి.మీ ప్రయాణించి రూ 23,89,056 ఆదాయంతో, రూ .148 ఓ ఆర్ మరియు 84.18 రూపాయల ఇపికెతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో హుజురాబాద్ డిపో ద్వీతీయ స్థానం నిలవడానికి కృషి చేసిన కార్మికులను డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ పేరుపేరున అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు అందరూ ఐక్యంగా కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి రాఖీ పండుగ ఆదాయం పోగు చేయడమే ఉదాహరణగా నిలిచిందని డిపో మేనేజర్ పేర్కొన్నారు.







