
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్, ఆగస్టు 25: హుజూరాబాద్ పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ ను 4వ వార్డు కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి, 5వ కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్ లు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల బదిలీపై వచ్చిన సీఐ జి తిరుమల్ గౌడ్ ను ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో వీరు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం సీఐ తిరుమల్ గౌడ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తిరుమల్ రెడ్డి అన్నారు.






