మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన కవి, రచయిత్రి, ఉపాధ్యాయురాలు రావుల కిరణ్మయిని ఆదివారం ఆమె రచనల ఆవిష్కరణల సందర్భంగా ఘనంగా సన్మానించారు. హనుమకొండలో చక్రవర్తుల రాధాకృష్ణ సాహితి వేదిక ఆధ్వర్యంలో రావుల కిరణ్మయి రచించిన బొడ్రవుతు కథ సంపుటి, పీవీ నరసింహారావు ఉయ్యాల పాట పుస్తకాల ఆవిష్కరణ ఎమ్మెల్సీ, పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత్రి రావుల కిరణ్మయి రచనలను పలువురు ప్రశంసించారు. మహిళలు సాహిత్య రంగంలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్వర్గీయ పీవీ నరసింహారావు చరిత్రను ఉయ్యాల పాట రూపంలో రాయడం గొప్పదైనదని, తెలంగాణ భాష వ్యాసపట్ల ఆమెకున్న పట్టు అనన్యమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు రాధాకృష్ణ సాహితి వేదిక అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మహమ్మద్ రియాజ్, ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, జానపద విజ్ఞాన వేత్త ఆచార్య ఎన్ భక్తవత్సలరెడ్డి, కల్వకుంట వెంకట సంతోష్ బాబు, రావుల పుల్లాచారి, బివిఎన్ స్వామి, మేరుగు అనురాధ, డాక్టర్ అడ్లూరి వెంకటేశ్వర్లు, కానుగుల భద్రయ్య, గుండు రవి పోలోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.