Oplus_0
-రాజకీయ కోణంలో కాకుండా రైతుల గురించి ఆలోచిస్తాం.
-రైతులకు న్యాయం చేసేలా కృషీ చేస్తా.
–ఆందోళన వద్దు-ఆదుకునే భాధ్యత నాది.
–కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కల్వల ప్రాజక్టు కింద ఉన్న రైతులకు న్యాయం జరిగేలా త్వరలోనే నిర్మాణ పనులు జరిగేలా చూస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ వొడితల ప్రణవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ కోణంలో కాకుండా రైతులకు ఉపయోగపడే ప్రాజక్టు పరంగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని, రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని అన్నారు. భారీ వర్షాలకు, వరదలకు ప్రాజెక్టు డ్యామేజ్ అయినప్పుడు అధికారంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం వారు అప్పుడే మరమ్మత్తులు చేపట్టి ఉంటే ఇప్పటికీ కల్వల ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఉపయోగపడేదని అన్నారు. ప్రాజక్టు కింద రైతులు, ఇతర జీవన విధానంపై ఆధారపడి బ్రతికే వారు ఎవరు అధైర్యపడొద్దని సంభందిత అధికారులతో మాట్లాడి ప్రాజక్టు సందర్శించి, మరమ్మత్తు పనులు పూర్తి చేస్తానని చెప్పారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్ట్ సందర్శించి పూర్తి వివరాలు అధికారుల ద్వారా అంచనావేసి మరమ్మత్తులు పనులు ప్రారంభిస్తామని తెలిపారు.







