
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా BCలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.





