
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి రిమాండ్ చేసి ఐదు నెలల తర్వాత బెయిల్ రావడంతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, జైలు కొత్త కాదని ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఔన్నత్యాన్ని తగ్గించలేరని అన్నారు. కుట్ర పూరితంగా కవితను జైలుకు పంపినప్పటికీ చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరం చేయడం ఎవరికి సాధ్యం కాదని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల మధ్యలో అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామని, ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల శాఖల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగము ఐలయ్య, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యం రాజు, ముక్క రమేష్, కేశిరెడ్డి లావణ్య, మారేపల్లి సుశీల, నాయకులు కొండ్ర నరేష్, బీఏస్ ఇమ్రాన్, మోరే మధు, ఒంటెల రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బత్తుల సమ్మయ్య, పంజాల శ్రీధర్, దిల్ శ్రీను, సారయ్య, సదానందం గౌడ్, సత్యంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







