
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: విద్యార్థులు కేవలం పుస్తకాల పురుగుగా కాకుండా చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని క్రీడల వల్ల శారీరక వికాసం మానసిక ప్రశాంతత లభిస్తుందని హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడోత్సవాలను సిఐ తిరుమల్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలను ఆడడానికి ప్రోత్సహించడం లేదని, పిల్లలు కేవలం ఇండోర్ గేమ్స్ సెల్ఫోన్ కి పరిమితం అవుతున్నారని అన్నారు. క్రీడల వల్ల శారీరక పట్టుత్వం పెరగడమే కాకుండా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. ఉపాధ్యాయులు సైతం పిల్లలు ఆటలు ఆడే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆ వాతావరణం కల్పించాలని అన్నారు.
–కబడ్డీ, ఖో ఖో.. లలో పోటీలు
మండల స్థాయి క్రీడోత్సవాల్లో భాగంగా గురువారం నుండి శనివారం వరకు 14, 17 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు కబడ్డీ కోకోలలో క్రీడల నిర్వహిస్తున్నట్లు ఎస్జిఎఫ్ కార్యదర్శి సొల్లు సారయ్య తెలిపారు. గురువారం కోకో పోటీలు నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం కాబట్టి శనివారం ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, సత్య ప్రసాద్, భాగ్యలక్ష్మి, రేణుక, ప్రవీన్, ఎడ్వర్డ్, శ్రీనివాస్, సత్యం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.








