
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడోత్సవాలు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. రెండో రోజు క్రీడల్లో భాగంగా కబడ్డీ క్రీడలు 14 ,17 వయసు లోపు బాల బాలికలకు నిర్వహించారు. మొత్తం 48 కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల ప్రారంభానికి క్రీడాకారులు కొలిపాక శ్రీనివాస్, తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ హాజరైనట్లు మండల ఎస్ జిఎఫ్ కార్యదర్శి సొల్లు సారయ్య తెలిపారు. ఈ క్రీడల్లో పిఈటిలు భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, అనిల్, రేణుక, సత్యం, ఎడ్వర్డ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








