
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిఆర్ఎస్ నాయకుడు పోతరవేని అనిల్ కుమార్ – తిరు మేశ ల వివాహ కార్యక్రమం శుక్రవారం హుజురాబాద్ సాయి రూప ఫంక్షన్ హాల్లో జరగగా హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్దే రాధిక శ్రీనివాస్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిఆర్ ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, యువ నేత వొడితల ఇంద్రనీల్ హుజురాబాద్ పట్టణంలో శ్రీ సాయి రూపా ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కౌన్సిలర్ పోతారవేని అనిల్ కుమార్ – తిరుమేష వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అలాగే కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.







