
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటు, పిట్టలవాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియాలో, 16వ వర్డ్, మోత్కులగూడెం కాలనీలో గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వరద భాదితులు ప్రణవ్ కు తమ సమస్యలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిచిపోతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల నుండి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలోకి వస్తున్నాయని, గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదని కాలనీవాసులు ప్రణవ్ కు మొరపెట్టుకున్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, వరద కాలువలు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. వోడితల ప్రణవ్ వెంట మున్సిపల్ కౌన్సిలర్లు,
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.











