
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున కోటి విరాళం ప్రకటించిన సినీ హీరో రామ్ చరణ్. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది.. ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.






