
-మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు ఆత్మహత్య కలకలం
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుణమాఫీ జరగలేదని రైతు సురేందర్ రెడ్డి (52) మేడ్చల్ అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






