స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, అలుపెరగని మలిదశ పోరాట యోధుడు జిట్టా బాలకృష్ణరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. మెదడు సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పైన ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు. ఆయన స్వగ్రామమైన భువనగిరిలోని ఆయన ఫామ్ హౌస్ లో జిట్టా బాలకృష్ణారెడ్డి అంతక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన సంఘాల నిర్మాణంతో యువకుల్లో నవనిర్మాణం, చైతన్యం నిర్మించారు. నల్గొండ మెదక్ లోని ఫ్లోరైడ్ పిడత గ్రామాలను ఫ్లోరోసిస్ రాక్కసి నుండి కాపాడిన గొప్ప నేత. ఏనాటికైనా ఎమ్మెల్యే కావాలన్నా తన చిరకాల వాంఛ తీరకుండానే తనువు చాలించడం పలువురుని కలిసివేసింది. జిట్టా బాలకృష్ణ మృతి పట్ల గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, జిట్టా అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
- Home
- నేలకొరిగిన తెలంగాణ ఉద్యమకేరటం.. జిట్ట మృతితో తీవ్ర విషాదం.