మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పోషకాహారం గర్భిణీ స్త్రీలకు అత్యంత ఆవశ్యకతమైన ఆహారమని హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసo కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోషకాహారంపై అవగాహన నిర్వహించారు.
అనంతరం సిడిపిఓ సుగుణ మాట్లాడుతూ… బిడ్డ తల్లి కడుపులో పడినప్పటికీ మొదలుకొని బిడ్డ పుట్టి రెండవ పుట్టినరోజు నిండే వరకు మొదటి 1000 రోజులు జీవితంలో అతి ముఖ్యమైనదనీ అన్నారు. స్త్రీలు గర్భం ధరించినప్పటి నుండి అందుబాటులో దొరికే ఆకుకూరలు కూరగాయలు, పప్పులు, పాలు, కోడిగుడ్లు, పండ్లు చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపే ముర్రుపాలు పట్టి ఇవ్వాలని, బిడ్డకు ఆరు నెలలు నిండగానే తల్లిపాలతోపాటు అనుబంధ ఆహారం మొదలుపెట్టాలని సూచించారు. బిడ్డ వయసు పెరుగుతున్న కొద్దీ ఫుడ్డు మోతాదు పెంచుతూ రెండు సంవత్సరములు వచ్చేవరకు తల్లిపాలు కొనసాగించాలనీ అన్నారు. డాక్టర్ మానస పోషణ ఉన్న పిల్లలను హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి, పిల్లలకు అక్షరాభ్యాసం జరిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఐ శ్రీదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజశ్రీ, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేర్ నాగరాజు, కార్యదర్శి ఝాన్సీ, ఐసిపి ఎస్ రమేష్, అంగన్వాడి టీచర్ సుభద్ర పాల్గొన్నారు.