
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పర్యావరణాన్ని కాపాడడానికి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయకులను హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త క్యాస నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో….
వినాయక చవితిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మాడిశెట్టి వీరన్న, కొమురవెల్లి వీరన్న తదితరులు పాల్గొన్నారు.






