
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో డ్రై డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్… మాట్లాడుతూ వార్డు ప్రజలు తమ ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇంటి ఆవరణలో కాళీ డ్రమ్ములలో కానీ టైర్లలో గాని ఇతర వస్తువులలో గాని నీరు నిలువ ఉండడం వల్ల దోమలు చేరుతాయని తద్వారా వ్యాధులు ప్రబలుతాయి అన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గందే రాధిక, కౌన్సిలర్, అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, ఇన్ చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, సానిటరీ జవాన్లు ఆరెల్లి రమేష్, హెల్త్ సూపర్ వైజర్ సత్యం, ఆశా వర్కర్లు, మెప్మా RPలు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
