
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడిన మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మహేష్ గౌడ్ నియమాకం కావడం చాలా ఆనందకరమైన విషయం అన్నారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ ను నియామించిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి సమ్మిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
