
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ లు స్వతంత్రంగా ఆలోచించి ముఖ్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం బీసీలకు సిద్ధిస్తుందని సామాజిక న్యాయ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో బీసీ కుల గణన సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనైక్యంగా బీసీలు ఉండడం వల్లనే కొద్ది మంది ఉన్న అగ్రవర్ణాల ఆటలు సాగుతున్నాయని అన్నారు. బీసీలు ఇప్పటివరకు వివిధ పార్టీలో ఉండి ఆ పార్టీల అభివృద్ధి కోసం సేవ చేశారని, కానీ బీసీల అభివృద్ధి కోసం కానీ, ప్రయోజనం కోసం కానీ ఆ యా రాజకీయ పార్టీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీసీ వ్యక్తి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ బిజెపి ద్వారా బీసీలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓట్ల కోసమే వినియోగించుకుంటున్నారు తప్ప వారి ప్రయోజనాన్ని కాపాడడం లేదని అన్నారు. బీసీలు అనైక్యంగా ఉన్నంతకాలం అగ్రవర్ణాల ఆటలు సాగుతాయి ఆయన అన్నారు. కుల గణన చేపట్టక ముందే 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రకటిస్తుందని ఈ ప్రకటనతోటే కాంగ్రెస్ చిత్తశుద్ధి కనపడుతుందని అన్నారు. కుల గణన జరిగిన తర్వాత బీసీల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే రాజకీయంగా ఎదుగుతారని రాజ్యాధికారం పొందవచ్చని పేర్కొన్నారు. ఇంతకాలం బీసీలను అన్ని వర్గాలు మోసం చేశాయని, ఇంకా బీసీలు రాజకీయ పార్టీలు తమకేదో మేలు చేస్తాయన్న భ్రమలోనే ఉన్నాయని ఆ భ్రమల నుంచి తేరుకొని బీసీల కోసం బిసి రాజకీయ పార్టీ పెట్టుకోవాలని అన్నారు. ఇంకా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కొంతమంది ఆ పార్టీలకు ఊడిగం చేస్తున్నారని అది మానుకొని బీసీగా తలెత్తుకొని జీవించాలని అన్నారు. బీసీల రాజ్యాధికారం సిద్ధించడం కోసం ప్రతి ఒక్క బీసీ ఇతర బీసీలను చైతన్య పరచడం ద్వారా త్వరలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని అన్నారు. సదస్సులో కుల జనగణన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గాలిబు అమరేందర్ ముదిరాజ్, ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, రైతు సమన్వయ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఎరుకల రాజన్న, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ కే వీరస్వామి, డిఎల్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, సాధన సమితి హుజురాబాద్ ఇన్చార్జి మార్త రవీందర్, భీమోజు సదానందం, మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజ్యం, వేల్పుల ప్రభాకర్ పులి జగన్నాథం, పంజాల రాజకుమారి, టీఎస్ సింగ్, శోభ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






