
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: టీచర్స్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన హుజురాబాద్ పట్టణానికి చెందిన దేవరకొండ సంతోష్ ను బాల్య మిత్రులు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా పూలదండలతో సత్కరించారు. సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నిబద్ధతతో కూడిన విధులు నిర్వహించడం వల్లనే సంతోష్ అవార్డు పొందారని, మరిన్ని ఉన్నత సత్కారాలు పొందాలని బాల్య మిత్రులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు పరాoకుశం కిరణ్ కుమార్, మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, ఎండీ చాంద్, టీఎస్ సింగ్, భూసారపు శంకర్, సుధీర్ గౌడ్, ఇజిగిరి సమ్మయ్య, దశరథం, నలుబాల వేణుగోపాల్, నల్ల సురేందర్, భూసారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






