
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి- శ్రీనగర్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరోత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సబ్బని తిరుపతి- అనురాధ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి భోజనం స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరుపేరునా తిరుపతి రాధ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారిని ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యుల ద్వారా చిరు సత్కారం చేశారు.ఈ మహత్కార్యానికి అవకాశం ఇచ్చిన యూత్ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. ఇందులో కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు కనుకయ్య, భద్రయ్య, వెంకట్ రెడ్డి, సుంకు మొగిలి మరియు సభ్యులు పాల్గొన్నారు.
–గణనాథుడి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమం
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని హనుమాన్ దేవాలయం ఆవరణలో ప్రతిష్టించిన మినీ బాలాపూర్ గణనాథుడి సన్నిధిలో లక్ష్మిగణపతి హోమం నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి నందకిషోర్, యూత్ సభ్యులు అకినపల్లి శ్రావణ్, రంజిత్, సందీప్, రాహుల్, పిల్లి తిరుపతి, సాయితేజ, సాయి, శివసాయి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.









