
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బిజెపి సిద్ధాంతాలు నచ్చిన వారు, స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరించాలని పలువురు నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కార్యక్రమ కో ఆర్డినేటర్ కొలిపాక శ్రీనివాస్, కో కో ఆర్డినేటర్ లు యంసాని శశిధర్, నరాల రాజశేఖర్, సీనియర్ నాయకులు మెరుగు రాజిరెడ్డి, న్యాయవాదులు కేసరి శేషయ్య, గూడూరి సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకులు జెల్లా సుధాకర్, మాసాడి ముత్యంరావు, తూముల శ్రీనివాస్, వై ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు పైళ్ల వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






