Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సెప్టెంబర్13: గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన అధ్యక్షునిగా పట్టణానికి చెందిన బుర్ర నటరాజ్ ను ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బుర్ర నటరాజు మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే గణపతి నిమజ్జనం ఉత్సవ కమిటీ మరియు నగర పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న నిమజ్జనం రోజున స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆహ్వాన వేదికను ఏర్పాటు చేస్తున్నామని, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పట్టణంలోని గణపతి మంటప నిర్వాహకుల నిమజ్జన ఊరేగింపు రథాలను ఆహ్వానించి సన్మానించడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా గణపతి మంటప నిర్వాహకులకు సహకారాన్ని అందిస్తూ వారి రథాల రూట్ మ్యాపులను అందజెయ్యడం, ఆయా రూట్లలో కరెంటు తీగలు చెట్లు అడ్డుగా లేకుండా విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, ఫైర్ శాఖ, పోలీస్ శాఖతో అనుసంధానంగా మంటప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణపతి నిమజ్జన ఉత్సవ సమితి సహకరిస్తుందన్నారు. నూతన ఉత్సవ సమితిలో ఉపాధ్యక్షులుగా వంగల రాహుల్, సురేష్, ప్రధాన కార్యదర్శి కన్నన్ దొరై రాజ్, సహాయ సహాయ కార్యదర్శులుగా నల్లగొని రాకేష్, కొండ్ర మహేష్, కోశాధికారిగా కొమురవేల్లి సంతోష్, కార్యవర్గ సభ్యులుగా మోటపోతుల రాకేష్, ఏజ్జు రాజు, వలిపిరెడ్డి రమేష్, బూర్ల నాగభూషణం, గౌరవ సలహాదారులుగా మునిసిపల్ చైర్మన్ శ్రీమతి గంధే రాధిక-శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల -శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య-నరసింహారెడ్డి, గౌరవ వార్డు కౌన్సిలర్లు నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు.






