
–కళాకారులు కొమురవ్వ వరంగల్ లో ఇళ్లు నిర్మిస్తమన్న మంత్రి పొన్నం ప్రభాకర్, తన జీతంలో నుండి లక్ష రూపాయలు అందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ ,సెప్టెంబర్ 13:
పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య గౌడ్ – 2024 జీవన సాఫల్య పురస్కారాన్ని సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ బలగం ఫేం కొమురవ్వలకి ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య ,ఎమ్మేల్యేలు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం పొందిన చంద్రబోస్ బలగం ఫేం కొమురవ్వ లకు శుభాకాంక్షలు తెలిపారు.14 వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య గౌడ్ గారికి నా నివాళులు అర్పించారు.పొన్నం సత్తయ్య పేరిట చారుటేబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కుమారులకు అభినందనలు తెలిపారు.పొన్నం సత్తయ్య గౌడ్ చదువు విలువ తెలుసు
చదువు రాకున్నా కుమారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించారనీ కొనియాడారు. కుటుంబ విలువలను కాపాడుతూ ఉమ్మడి కుటుంబ విలువల గురించి నేర్పించారని ,భూమిని నమ్ముకొని ఆదర్శ రైతు అని అభినందించారు. భూమి పుత్రుడు సత్తయ్యగౌడ్ పేరు మీద కవులకు కళాకారులకు సన్మనించుకొనీ సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. బలగం సినిమాలో పాడిన పాటలు కొమురవ్వ ఉమ్మడి కుటుంబాల విలువలు తెలిపారని కష్టాల్లో ఉన్న కొమురవ్వ ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని తన జీతం నుండి తక్షణమే లక్ష రూపాయల సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారి ఇంటికి అనేక సందర్భాల్లో వెళ్ళే వాళ్ళమని వారి ఆప్యాయతలు అనురాగాలు, ఉమ్మడి కుటుంబ జీవన విధానాన్ని కొనియాడారు. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కుటుంబం అంటే పొన్నం కుటుంబమని అభినందించారు.పొన్నం ప్రభాకర్ మంత్రి అయినా వారి అన్నదమ్ములు ,అక్క చెల్లెళ్ల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తారనిఎంత ఎదిగినా ,ఒదిగి ఉండాలని ఆయనను చూస్తే తెలుస్తుందన్నారు. ఎక్సైజ్ & పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి అయినా తరువాత కూడా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే వారి జీవన విధానం తెలుపుతుందని అభినందించారు. పుత్రులు ప్రయోజకులు కావాలని పొన్నం సత్తయ్య దంపతులు కోరుకునేదని గుర్తు చేశారు. జీవన విధానం ధ్వంసం అయింది కాబట్టి ఈ అనర్థాలకు కారణమని పొన్నం సత్తయ్యగౌడ్ ఉమ్మడి కుటుంబం సంస్కృతి సంప్రదాయాలకు నెలవు అని కొనియాడారు.
సినీ గేయ రచయిత, పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం గ్రహీత చంద్రబోస్ మాట్లాడుతూ పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందనీ అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు స్థానిక కళాకారులతో కలిసి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.3500 కి పైగా పాటలు పాడాననీ తన పాటకు స్ఫూర్తి ఒగ్గు కళాకారులు కళారూపం అన్నారు.
పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం గ్రహీత మాట్లాడుతూ పొన్నం సత్తయ్య గౌడ్ ఐదుగురి సంతానం ఈ అవార్డులు అందుస్తుండడం మంచి పరిణామం అన్నారు.పొన్నం సత్తయ్య గౌడ్ గారి మీద పాట పాడి కొమురవ్వ ఆలపించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న సందర్భంలో కొమురవ్వ ఉమ్మడి కుటుంబం పై పాటకు ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబం తరుపున వరంగల్ లో కొమురవ్వ కు ఇళ్లు కడతామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో కొమురవ్వ భర్త కు మంచి చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి కొమురవ్వ కు కళాకారుల పెన్షన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం సందర్భంగా వారి కుమారుడు ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర గౌడ్ వారి బాపును గుర్తుచేస్తున్నారు. బాపుకు కళాకారులు , రచయితలు అంటే ఇష్టమని ఆయనకు ఆరో ప్రాణం రేడియో..చనిపోయే వరకు రేడియో లో కథలు,నాటికలు వార్తలు వినేవారనీ తెలిపారు. బాపు కు ఒగ్గు కథలు,బుర్ర కథలు అంటే ఇష్టమన్నారు.గత 3 సంవత్సరాలుగా పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నామనిఈసారి చంద్రబోస్ ,కొమురవ్వలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.మొదటి సంవత్సరం లో నలేశ్వరం శంకర్ ,ఒగ్గు కథ ధర్మయ్య ,రెండవ సంవత్సరం నెలిమెల భాస్కర్ ,విమలక్క లకు అందించడం జరిగిందనీ పొన్నం రవిచంద్ర గౌడ్ తెలిపారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం, సంజయ్, శ్రీ గణేష్ , వీర్లపల్లి శంకర్ , నాగరాజు, మేఘారెడ్డి , ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, రవాణా రోడ్స్ అండ్ బిల్డింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ రావు, వెలిచాల రాజేందర్ రావు, మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి, రచయిత్రి శ్రీ లక్ష్మి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.











