Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు
ఈ రోజు హుజారాబాద్ మండల మరియు పట్టణ కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా విభాగం, మరియు ముస్లిమ్ మైనార్టి నాయకులతో కలిసి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకులపై ఫిర్యాదు చేసారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కానీ కేంద్ర మంత్రి అమిత్ షా కానీ తెలంగాణ రాష్ట్రమునకు సంబంధించిన బిజెపి నాయకులు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ఇంకా తదితర నాయకులు కాంగ్రెసు పార్టీ అగ్రనాయకుడు, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేసిన నిరాధరణమైన ఆరోపణలపై బిజెపి ప్రజా ప్రతినిధుల, నాయకులపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి మీ నాన్నమ్మకు పట్టిన గతే మీకు పట్టుతుందని రాహుల్ గాంధీని అనుచిత వాక్యాలు చేస్తూ, అవమానిస్తు,
దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుల మనోభావాలకు భంగం కలుగుతున్నందున అలాగే రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11,00,000/- ల బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాదుల వ్యవహరిస్తున్న బిజెపి నాయకుల, నరరూప నక్షసుల అన్నట్లు వ్యవరిస్తున్నారన్నారు. బిజెపి కేంద్ర మంత్రి రణ్వీర్ బిట్టు మరియు బిజెపి యంఎల్.ఏ తన్విందర్ సింగ్, శివసేనా ఏక్ నాథ్ సిండే వర్గం, యం.ఎల్.ఏ. సంజయ్ గైక్వాడ్ ఉత్తర్ ప్రదేశ్ యంఎల్.ఏలు వీరిపై చట్టపరంగా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, మేకల తిరుపతి, యేముల పుష్పలత, లంకదాసరి లావణ్య,
యండి అఫ్సర్, మిడిదోడ్డి రాజు, కొలిపాక శంకర్, సాయిల్ల రాజు, చల్లూరి రాహుల్, గంట కిరణ్ రెడ్డి, వాసాల శ్రీనివాస్, సమ్మెట సంపత్, సదానందం, ఈరెల్లి సమ్మయ్య, సునిత, సొల్లు సునిత తదితరులు పాల్గొన్నారు.

*పత్రికా ప్రకటనలు*






