Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ, 10వ వార్డులలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆయా వార్డుల ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మురికి కాలువలలో చెత్తా చెదారము వేయకుండా ప్రతిరోజూ ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య తోపుడు బండ్ల వారికి చెత్తను అందించాలని కోరారు. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలలో వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు సభ్యుడు బోరగాల శివకుమార్, 10వ వార్డు సభ్యురాలు గోవిందుల స్వప్న భాస్కర్, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, ఎన్విరాన్మెంటల్ ఏఈ వినయ్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్ ఆర్ సుధీర్, ఆశ వర్కర్, మెప్మా RPలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.







