
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవరణలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వందరోజుల వికసిత్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్తవ్రేత్తలు విజయ్, శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ…. ప్రస్తుత రసాయనిక వ్యవసాయ పరిస్థితులు, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను వివరించారు. వరి, ప్రత్తి పంటలలో వస్తున్న చీడపీడలు, తెగుళ్ళు వాటి యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటే ప్రయోజనం అని అన్నారు. తదుపరి రైతుల యొక్క పంట క్షేత్రాలను సందర్శించి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో హుజురాబాద్ Aeo నిఖిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి , రైతులు పాల్గొన్నారు.








