
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల డాక్టర్ వి నరేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం EO కిషన్ రావు స్వామివారి చిత్రపటాన్నీ అందజేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో LHPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజు నాయక్, యూత్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సత్యగోపల్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.







