
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి బదిరుల రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం బధిర విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రతినిధులు 20 వేల విలువైన నోటుబుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థులను ఆదుకునేందుకు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. బధిర విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఏ అవసరం ఉన్న తమను సంప్రదించవచ్చని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలకు అవసరమైన సీలింగ్ ఫ్యాన్లు త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు. నోటుబుక్స్ అందజేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
హెచ్ఎం ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్, పిడిజి చిదుర సురేష్, పిఆర్ఓ ఎలగందుల మునిందర్, ఆర్సీ కొండా రాంబాబు, ప్రోగ్రాం చైర్మన్ పుల్లూరి సంతోష్, లయన్ సింగమరాజు, ప్రసాద్ కంభం రాచకొండ సంతోష్, ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.





