
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: సినీ గీత రచయిత చంద్రబోస్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. RRR చిత్రంలో “నాటు నాటు” పాటకు సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, పీసీసీ అధ్యక్షులు మహేశ్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రికి ఆస్కార్ పురస్కార ప్రతిమను చూపించగా చంద్రబోస్ ని వారు అభినందించారు.








