మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందడానికి ఈ నెల 30వ తారీకు వరకు అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్ర ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఇందిరాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఉత్తీర్ణులు అయినవారు ప్రవేశం పొందడానికి అర్హులు అని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజురాబాద్ అధ్యయన కేంద్రంలో కేంద్రాన్ని ఎంచుకునే విద్యార్థులు 050 కోడును ఎంపిక చేసుకొని అధ్యయన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని అన్నారు.





